Salaar : రియల్ క్యారెక్టర్ స్పూర్తితో ప్రభాస్ మూవీ..?

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కు జోడీగా ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు. శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అయినా శృతిహాసన్ ప్రభాస్ తో కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ రోల్ లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలోని హీరోయిన్ పాత్రను రియల్ జర్నలిస్ట్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

అయితే చిత్రయూనిట్ నుంచి ఈ మేరకు అధికారక ప్రకటన రావాల్సి ఉంది. అయితే సినిమాలో శృతిహాసన్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారని జరుగుతున్న ప్రచారం వల్ల ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. శృతిహాసన్ గతంలో సింగం 3 సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సినిమాలో శృతి జర్నలిస్ట్ పాత్రను పోషించగా బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా సక్సెస్ కాలేదు. శృతి సలార్ సినిమాతో ఆ ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తారో లేదో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాల్సి ఉంది. కేజీఎఫ్ సినిమాలో హీరో యశ్ ను ఎలివేషన్స్ తో అద్భుతంగా చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో ప్రభాస్ ను యశ్ కు మించి చూపిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2022 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాతో పాటు ఆదిపురుష్ సినిమా కూడా రిలీజ్ కానుండటం గమనార్హం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus