Salaar2: సలార్ మూవీపై షాకింగ్ అప్ డేట్స్.. సలార్2 వేరే లెవెల్ అంటూ?

సలార్ మూవీ కథకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటికే విడుదలైన సలార్ ట్రైలర్లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేసింది. సలార్1 లో ప్రభాస్ దేవాగా కనిపించనుండగా సలార్2 సినిమాలో దేవా తండ్రి సలార్ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్తల గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
సలార్2 వేరే లెవెల్ లో ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ విషయంలో సలార్ సంచలనాలను సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఉందా? లేదా? అనే ప్రశ్నకు జవాబు దొరకాల్సి ఉంది. సలార్ మూవీ బుకింగ్స్ సంచలనాలు సృష్టిస్తుండగా కేజీఎఫ్2 రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

సలార్ యాక్షన్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లా ఉండబోతుందని సమాచారం అందుతోంది. సలార్ సినిమాలో శృతి రోల్ కూడా సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. 3 గంటల సినిమాగా తెరకెక్కినా ఈ సినిమా బోర్ కొట్టదని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. సలార్ మూవీ 300 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నిర్మాతలకు ఇప్పటికే ఊహించని స్థాయిలో లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో (Salaar2) సలార్2 రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రభాస్ రేంజ్ ను సలార్ మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్ ప్రభాస్ కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. సలార్ మూవీ ఇతర భాషల్లో సైతం సంచలనాలు సృష్టించే ఛాన్స్ ఉంది. ప్రభాస్ కు మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫాలోయింగ్ పెరుగుతోంది.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus