కేజీఎఫ్2 ను మించి సలార్ ఉంటుందట!

కేజీఎఫ్1, కేజీఎఫ్2 సినిమాలతో ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన భువన్ గౌడకు మంచి పేరు వచ్చిందనే సంగతి తెలిసిందే. కేజీఎఫ్1 సినిమా తీసే సమయంలో నిర్మాత చాలా సపోర్ట్ చేశారని మేము ఏం అడిగినా ఆయన అందించారని 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలని అడిగితే 700 మందిని తీసుకోవాలని ఆయన సూచించేవారని భువన్ గౌడ చెప్పుకొచ్చారు. అందువల్ల ఇవన్నీ సులువుగా అచీవ్ చేయగలిగామని భువన్ గౌడ తెలిపారు.

కేజీఎఫ్1 సినిమా తీసే సమయంలో మంచి సినిమా తీస్తున్నామని తెలుసని అయితే ఈ సినిమాకు ఈ స్థాయిలో రీచ్ దక్కుతుందని తాను అనుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్ నీల్ మొత్తం కథ చెప్పరని ఆయనకు నాతో వర్క్ ఎలా తీసుకోవాలో తెలుసని భువన్ గౌడ పేర్కొన్నారు. సీన్ లో కిక్ ఏంటో ఆయన చెబితే మేము లైటింగ్ ప్లాన్ చేసుకుంటామని భువన్ గౌడ తెలిపారు. ప్రశాంత్ నీల్ సార్ అద్భుతమని తనకు, ప్రశాంత్ నీల్ కు మధ్య మంచి బాండ్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

కేజీఎఫ్3 గురించి నాకు తెలియదని ఆ విషయాన్ని ప్రశాంత్ నీల్ ను అడగాలని ఆయన తెలిపారు. ప్రశాంత్ నీల్ నన్ను వదిలి సినిమా చేస్తే సూసైడ్ చేసుకుంటానని భువన్ గౌడ పేర్కొన్నారు. కేజీఎఫ్ టీమ్ ఫ్యామిలీ అని నేను, ప్రశాంత్ నీల్ చాలా కష్టాల్లో పెరిగామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రశాంత్ నీల్ కు మంచితనం, సినిమా మాత్రమే తెలుసని ఆయన తెలిపారు. కేజీఎఫ్2, సలార్ మధ్య కనెక్షన్ లేదని భువన్ గౌడ చెప్పుకొచ్చారు.

ప్రభాస్ సార్ అమేజింగ్ అని ఆయనతో పని చేయడం సంతోషంగా ఉందని భువన్ గౌడ ఉన్నారు. ప్రభాస్, యశ్ లలో హంబుల్ నెస్ ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. తనకు రెమ్యునరేషన్ గా మంచి పేమెంట్ దక్కుతుందని భువన్ గౌడ వెల్లడించారు. సలార్ బిగ్ ప్రాజెక్ట్ అని కేజీఎఫ్ కంటే పెద్దగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. సలార్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయని భువన్ గౌడ వెల్లడించారు.

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus