Salman Kahan: సల్మాన్‌ జీవితంలో ముఖ్యమైనవి ఏవో తెలుసా?

సల్మాన్‌ ఖాన్‌ వ్యక్తిత్వం చాలా డిఫరెంట్‌. అందరి హీరోల్లా ఆయన ఉండరు. అలాగే సగటు హీరోలా ఎప్పుడూ ప్రవర్తించారు. ఆయన పర్సనల్‌ లైఫ్‌ కూడా చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది అంటారు. అలాంటి ఆయన లైఫ్‌లో ఆయనకు బాగా ఇష్టమైనవి ఏవో ఓ లుక్కేద్దాం. సల్మాన్‌ను ఖాన్‌ బాగా ఫాలో అయ్యేవారికి మేం చెప్పే విషయాలు ఇప్పటికే తెలిసి ఉంటాయి. ఒకవేళ మీరు అంతగా ఫాలో కాకపోతే కొత్తగా ఉంటాయి అని చెప్పొచ్చు.

* సల్మాన్‌ ఖాన్‌ చేతికి ఓ బ్రాస్‌టెట్‌ ఉంటుంది. కొన్నాళ్లక్రితం వాళ్ల నాన్న బహుమతిగా ఇచ్చారు. విలువైన రాయి ఉన్న ఆ వెండి బ్రాస్‌లెట్‌ పెట్టుకుంటే అదృష్టం అని ఫీల్‌ అవుతాడు సల్మాన్‌. అందుకే ఏ సినిమా అయినా.. బ్రాస్‌లెట్‌ తీయడానికి ఇష్టపడడు.

* నచ్చే హాలీడే స్పాట్‌ అంటే.. సల్మాన్‌ ఏ విదేశాలకు వెళ్తాడని అనుకుంటారేమో.. సల్మాన్‌ బాగా నచ్చే ప్రదేశం పన్వేల్‌లో ఉన్న అతని ఫాంహౌస్‌. ఏ షూటింగ్‌లూ లేనప్పుడు అడవి మధ్యలో ఉండే ఆ ఫాంహౌస్‌లోనే ఉండిపోతాడు. కరోనా సమయంలో సల్మాన్‌ ఖాన్‌ అక్కడే ఉండిపోయాడు. అక్కడే స్పెషల్‌ సాంగ్స్‌ కూడా చేసి రిలీజ్‌ చేశాడు కూడా.

* సల్లూ భాయ్‌కి బ్లాక్‌ కలర్‌ అంటే చాలా ఇష్టం. షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా బ్లాక్‌ కలర్‌ షర్ట్స్‌, టీ షర్ట్స్‌, కుర్తా తీసుకుంటూ ఉంటాడు. వాటిని సమయం సందర్భం అంటూ లేకుండా నచ్చినప్పుడల్లా వేసుకుంటూ ఉంటాడు.

* అమ్మ చేసే దాల్‌, రాజ్మా మసాలా, బిర్యానీ అంటే సల్మాన్‌ చాలా ఇష్టపడతాడు. ఆ మాటకొస్తే అమ్మ చేసే ఏ వంట అయినా ఇష్టమే అని చెబుతుంటాడు.

* ఈ కండల వీరుడికి.. హాలీవుడ్‌ కండల వీరుడు సిల్వెస్టర్‌ స్టాలోన్‌ అంటే చాలా ఇష్టం. ఇక హీరోయిన్లలో హేమమాలిని బాగా ఆరాదిస్తాడు.

* సబ్బుల్ని చూస్తే సల్మాన్‌ ఖాన్‌ కొనకుండా ఆగలేను. నేచురల్‌ సబులను మరీ ఇష్టంగా కొంటాడు. అన్నిరకాల ఫ్లేవర్లనీ కొనేసి బాత్రూంలో పెడుతుంటాడు. అలా సల్మాన్‌ బాత్రూంలో కొన్ని వందల సబ్బులు ఉన్నాయని అంటారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus