‘మంచి కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తాడు’ అనే మంచి పేరు శ్రీవిష్ణుకి ఉంది. అయితే అతని గత సినిమాలు ‘అర్జున ఫల్గుణ’ ‘భళా తందనాన’ ‘అల్లూరి’ వంటి సినిమాలు తీవ్రంగా నిరాశపరిచాయి. అయితే ఇప్పుడు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన లభించింది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ ను కలిగించింది.
హాస్య మూవీస్ బ్యానర్ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా (Samajavaragamana) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 29 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. అయితే సినిమా పై ఉన్న కాన్ఫిడెన్స్ తో టీం విడుదలకి మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేయడం జరిగింది. ఈ సినిమా చూసిన వారు పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. దీంతో టీంలో కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది అని చెప్పాలి.
కథ విషయానికి వస్తే.. బాక్సాఫీస్ బాలు(శ్రీవిష్ణు) తన ఇంట్లో పెయిన్ గెస్ట్ గా ఉండడానికి వచ్చిన సరయు( రెబా మోనికా జాన్) తో ప్రేమలో పడతాడు. అయితే ఇంటర్వెల్ కి ఆమె అతనికి చెల్లెలు వరుస అవుతుందని తెలుస్తుంది. ఆ తర్వాత చోటు చేసుకునే వింత పరిస్థితులను హీరో, హీరోయిన్లు ఎలా అధిగమించారు అనేది మిగిలిన కథ. రామ్ అబ్బరాజు తన గత సినిమా ‘వివాహ భోజనంబు’ లో లానే ఈ సినిమాని కూడా కామెడీతో నింపేసాడు.
సినిమా సాగదీత ఎక్కువ అవుతుంది అనుకునే టైంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ లో పేలే జోకులను సిట్యుయేషన్ కి తగ్గట్టు అమర్చి.. బోర్ అనే మాట రాకుండా జాగ్రత్త పడ్డాడు. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు బాగుంది. సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ లు బాగుంటాయి. ఓవరాల్ ఇది యావరేజ్ టు అబౌవ్ యావరేజ్ మూవీ అనుకోవచ్చు.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!