Samajavaragamana Twitter Review: ‘సామజవరగమన’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు ఈ చిత్రానికి దర్శకుడు. టీజర్, ట్రైలర్లకి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫీలింగ్ ను కూడా అందరికీ కలిగించింది. హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పకులుగా వ్యవహరించారు. జూన్ 29 న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

కొన్ని చోట్ల షోలు పడ్డాయి. (Samajavaragamana) సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయలు షేర్ చేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కామెడీతో నింపేసాడు అంటున్నారు. సినిమా సాగదీత ఎక్కువ అవుతుంది అనుకునే టైంలో సోషల్ మీడియాలో, వాట్సాప్ లో పాపులర్ అయిన జోకులను సిట్యుయేషన్ కి తగ్గట్టు అమర్చి.. బోర్ అనే మాట రాకుండా చేసాడని అంటున్నారు.

ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా కొత్తగా ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ల్యాగ్ ఎక్కువైన ఫీలింగ్ కలిగినా క్లైమాక్స్ ను డిజైన్ చేసిన ఆకట్టుకుంటుంది అని అంటున్నారు. సీనియర్ నరేష్, వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ లు అలరిస్తాయట. ఐతే పాటలు మాత్రం బోర్ కొట్టించాయని అంటున్నారు. మరి ఇక్కడ మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుంది అనేది చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus