వీలుచిక్కినప్పుడల్లా తన విడాకుల గురించి, ఎక్స్ గురించి మాట్లాడుతూ టాపిక్ ఎప్పుడూ మీడియాలో, సోషల్ మీడియాలో ఉండేలా చూసుకుంటూ ఉంటుంది సమంత (Samantha). ఒకవేళ అలా కుదరకపోతే తన పెళ్లికి సంబంధించిన టాపిక్‌ను తీసుకొస్తూ ఉంటుంది. అలా ఎందుకు చేస్తుందో తెలియదు కానీ.. తాజగా మరోసారి తన పెళ్లి టాపిక్‌ను తీసుకొచ్చి ప్రజల నోళ్లలో నానుతోంది సమంత. తన కొత్త వెబ్ సిరీస్ ‘సిటడెల్’ ప్రచారంలో భాగంగా సమంత వివిధ మీడియా సంస్థలు, టాక్ షోల్లో కనిపిస్తోంది.
Samantha
ఈ క్రమంలో డివోర్స్ గురించి, డివోర్స్ తీసుకున్నవాళ్ల గురించి మాట్లాడింది. విడాకులు తీసుకున్నాక మహిళలు ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి సమంత మాట్లాడింది. ఇద్దరి మధ్య బంధం విచ్ఛిన్నమైతే అమ్మాయిలనే నిందిస్తారని అసహనం వ్యక్తం చేసింది. తనపై కూడా ఈ విషయంలో ఎన్నో అవాస్తవాలు ప్రచారం చేశారని బాధపడింది. డివోర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు ఈ సమాజం సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం వృథా, యూజ్డ్ అని ట్యాగ్స్ తగిలిస్తుందని, ఎందుకు ఇలా చేస్తారో అని బాధపడింది సామ్.
కష్టాల్లో ఉన్న ఆ అమ్మాయిని ఆ మాటలు మరింత నిరాశపరుస్తాయి అని చెప్పింది సామ్. ఇక కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన పెళ్లి గౌనును రీ మోడల్ విషయం గురించి కూడా సామ్ స్పందించింది. నా పెళ్లి గౌనును రీ మోడల్ చేయాలని అనుకున్నప్పుడు బాధపడ్డాను. అంతేకాదు ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ప్రయత్నించలేదు అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఇప్పటికైనా పెళ్లి గౌన్ విషయంలో కామెంట్లు ఆగుతాయేమో చూడాలి. అయితే ఎందుకు రీడిజైన్ చేసిందో చెప్పేసుంటే బాగుండేది.
మొన్నీమధ్యే ఏదో టాక్ షోలో మాట్లాడుతూ.. తన ఎక్స్‌కి బహుమతులు ఇవ్వడం కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశానని చెప్పింది. దీంతో ఆమె మాటలు వైరల్ అయ్యాయి. కొంతమంది అయితే మరి మీ ఎక్స్‌కి ఖర్చు అవ్వలేదా? ఆయన కూడా గిఫ్ట్‌లు ఇచ్చి ఉంటాడు కదా అని కామెంట్లు చేశారు. ఇప్పుడు కూడా మరి విడాకులు తీసుకున్న మగాడిని కూడా సూటిపోటి మాటలు అంటారు కదా అనే కామెంట్లు చేస్తున్నారు.