సరికొత్త పాత్రలు చేయడానికి సమంత ఉత్సాహం!

టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత చిత్ర సీమలోకి అడుగుపెట్టి ఏడేళ్లు అవుతోంది. అందాన్ని పెంచుకుంటూ, అభినయాన్ని మెరుగు పరుచుకుంటూ విజయాలను అందుకుంటోంది. ఏ ముచ్చట ఆ వయసులోనే జరగాలని పెద్దలు చెప్పిన విధంగా సినిమాల కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చెయ్యకుండా .. తాను ప్రేమించిన నాగ చైతన్యని  ప్రేమించి, కొన్ని రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరమవుతుందని అనుకుంటే.. ఇప్పుడే నటనలో తన కొత్త అధ్యాయం మొదలైందని చెబుతోంది.

‘‘హీరోయిన్ గా నా ఎదుగుదల ఓ అధ్యాయం. మనం చేయాలనుకొన్నది చేసే అవకాశం ఎవ్వరికో కానీ రాదు. కానీ నా ప్రతిభని బయటపెట్టాలనుకొన్న ప్రతిసారీ నా ఆశలకి, ఆకాంక్షలకు తగ్గ పాత్రలు, అవకాశాలు వచ్చాయి. అందుకే నా సినీ ప్రయాణం అంటే నాకెంతో ప్రేమ. ఆ ప్రేమవల్లేనేమో ఎప్పటికీ నటిస్తూనే ఉండాలనిపిస్తోంది. నటన పరంగా ఇకపై మరో కొత్త  చాప్టర్ మొదలవుతుందని నా గట్టి నమ్మకం. మన పరిశ్రమలో అందుకు తగ్గ వాతావరణం కూడా కనిపిస్తోంది. హీరోయిన్స్ కి గొప్ప పాత్రలు లభిస్తున్నాయి’’ అని సమంత చెప్పింది. చెప్పడమే కాదు విభిన్నమైన పాత్రలే చేస్తోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో చేస్తున్న రంగస్థలం 1985 లో సమంత పాత్ర కొత్తగా ఉండడనుంది.

అలాగే మల్టీ ల్యాంగ్వేజ్ మూవీ మహానటి లో కీలక రోల్ పోషిస్తోంది. వీటితో పాటు తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత నటిస్తోంది. ఈ తీరు.. జోరు చూస్తుంటే పెళ్లి తర్వాతే ఎక్కువ సినిమాలు చేసేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus