Samantha: మూడు రోజులు దూరంగా ఉన్నా.. ఒంటరితనం భయంకరం: సమంత

గత కొంతకాలంగా ప్రముఖ కథానాయిక సమంత (Samantha)  సోషల్‌ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతూ ఉంది. విడాకులు అయ్యాక, రుగ్మతల బారిన పడ్డాక ఆమె కొన్ని అవేర్‌నెస్‌ టిప్స్‌, హెల్త్‌ టిప్స్‌, పర్సనల్‌ టిప్స్‌ గురించి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తోంది. మరోవైపు వ్యక్తిగత విషయాల గురించి నేరుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా పోస్టులు పెడుతోంది. తాజాగా పెట్టిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. ఒంటరితనం భయంకంరం అంటూ ఆమె ఆ పోస్టులో రాసుకొచ్చింది.

Samantha

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. గత కొన్ని రోజులుగా పెద్దగా పోస్టులు, స్టోరీలు పెట్టడం లేదు. తరచుగా తనకు సంబంధించిన విశేషాలను, విహారయాత్రల ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది కదా.. ఎందుకు కొన్ని రోజులుగా కామ్‌గా ఉంది అనే డౌట్‌ ఫ్యాన్స్‌కి ఉంది. దీనికి ఆన్సర్‌ ఆమెను తాజా పోస్టు ద్వారా చెప్పేసింది. మూడు రోజులపాటు ఫోన్‌కు దూరంగా ఉన్నట్లు ఆ పోస్టులో రాసుకొచ్చింది.

నేను మూడు రోజులు మౌనంగా ఉన్నాను. దగ్గర్లో స్మార్ట్‌ ఫోన్‌ లేదు. ఎవరితో కమ్యూనికేషన్‌ కూడా లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం అత్యంత కష్టమైన విషయాల్లో ఒకటి. అలాగే భయంకరమైనది కూడా. కానీ, ఇలా ఉండడాన్ని ఇష్టపడతాను. లక్షలసార్లు ఇలా ఒంటరిగా ఉండమని చెప్పినా ఓకే. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పుకొచ్చింది సమంత.

ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. ఇటీవల మహిళా ప్రాధాన్య కథలతో మెప్పిస్తున్న సమంత, ఓటీటీలో కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తోంది. వరుణ్ ధావన్‌తో (Varun Dhawan)  చేసిన ‘సిటడెల్‌ : హనీ బన్నీ’ ఇటీవల వచ్చింది. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌’ సిరీస్‌ చేస్తోంది. మరోవైపు తెలుగులో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను స్వీయ నిర్మాణంలో అనౌన్స్‌ చేసింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్‌ లేవు. షూటింగ్‌ కూడా అవుతున్నట్లు లేదు. వెబ్‌ సిరీసుల్లోనే ఆమె బిజీగా ఉండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus