Samantha: పిల్లల విషయంలో గొప్ప నిర్ణయం తీసుకున్న సమంత!

  • November 23, 2023 / 03:29 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం పాటు విరామం ప్రకటించారు ఈమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి తరుణంలో సరైన చికిత్స తీసుకోవడం కోసమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత ఇప్పటికే ఎన్నో రకాల చికిత్సలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఈమె భూటాన్ లో కూడా చికిత్స తీసుకుంటున్నారు. సమంత భూటాన్ లో మయోసైటిసిస్ కోసం ఆయుర్వేద చికిత్స తీసుకోవడమే కాకుండా ఈ చికిత్సకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా (Samantha) సమంతకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఇద్దరు పిల్లలను దత్తత తీసుకోబోతున్నారు అంటూ ఈ వార్త సంచలనగా మారింది. సమంత పెళ్లి చేసుకుని విడాకులు తీసుకొని విడిపోయారు అయితే ఈమెకు పిల్లలు లేరనే సంగతి మనకు తెలిసిందే. ఇక పిల్లలు లేకపోయినా సమంత ఎంతోమంది పిల్లల బాగోగులను చూసుకుంటున్నారు.

ఈమె గత పది సంవత్సరాలుగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు ఎన్నో విధాలుగా సహాయపడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒక వైపు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులను ఆదుకుంటున్నటువంటి సమంతా మరో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకోవాలని భావించారట.

ఇలా ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని వారి పూర్తి బాగోగులను ఈమె చూసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది సమంత నిర్ణయం పట్ల అభినందనలు తెలియజేస్తున్నారు కానీ ఈ విషయం గురించి ఎక్కడ అధికారక ప్రకటన మాత్రం లేదు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus