సమంత అక్కినేని షాకింగ్ కామెంట్స్ వైరల్..!

నాగ చైతన్యను పెళ్లి చేసుకుని అక్కినేని వారింటి కోడలైన తరువాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది సమంత. ఎక్కువగా కథాప్రాధాన్యత కలిగిన సినిమాలనే ఎంపిక చేసుకుంటూ.. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోంది. సాధారణంగా పెళ్ళైన తరువాత హీరోయిన్లకు లైఫ్ ఉండదు అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి పడేసింది సమంత. నిజానికి పెళ్ళైన తరువాతే ఈమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిందని చెప్పొచ్చు. కేవలం సినిమాలకు మాత్రమే అన్నట్టు కాకుండా వెబ్ సిరీస్ లు, బిజినెస్ ల మీద కూడా సమంత దృష్టి పెట్టి రెండు చేతులా సంపాదిస్తోంది. గతేడాది సమంత ‘బిగ్ బాస్4’ లో ఒక ఎపిసోడ్ ను హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత ‘ఆహా’ కోసం సామ్ జామ్ అనే టాక్ షోని కూడా హోస్ట్ చేసి ఆకట్టుకుంది. బుల్లితెర పై కూడా రాణించగలను అని సమంత వీటి ద్వారా నిరూపించింది. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్ లో ఉండే సమంత ఇటీవల ఓ చిట్ చాట్ సెషన్ ను నిర్వహించింది.ఈ క్రమంలో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ట్రోలింగ్‌ పై ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు స్పందించింది.

సమంత మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు ట్రోలింగ్‌ వల్ల నిద్ర లేని రాత్రులు గడిపాను. అయితే ఇప్పుడు మాత్రం అవి గుర్తొస్తే నాకు భలే నవ్వొస్తుంది. అయినా మనల్ని ట్రోల్‌ చేస్తున్నారంటే మనం ఎంతో ఎత్తుకు ఎదిగామనే ఫీలింగ్ కలుగుతోంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘శాంకుతలం’ సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus