వైరల్ పిక్: ఆధ్యాత్మికం వైపు మళ్ళిన సమంత..!

ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పిక్ తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అయిన సమంత,రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు వారి ఫ్రెండ్స్ అయిన లక్ష్మీ మంచు,శిల్పా రెడ్డి వంటి వారు కూడా ఉన్నారు. ఈ నలుగురు నిన్న శివరాత్రి సందర్భంగా ఈ ఫోటోని తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. నిజ జీవితంలో ఈ నాలుగు చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్లకు భక్తి కూడా ఎక్కువే. అయితే ఈ ఫొటోలో సమంత కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

నిజానికి సమంత ఓ క్రిస్టియన్. ఈమె విద్యాభ్యాసం మొత్తం క్రిస్టియన్ స్కూల్, కాలేజీలలోనే జరిగింది. ఈమె ఇలా ఆధ్యాత్మికత వైపుకు మళ్లడం ఏంటి అని చాలా మంది ఇప్పుడు చర్చించుకుంటున్నారు. నిజానికి నాగ చైతన్యని పెళ్లి చేసుకున్న దగ్గరి నుండీ ఈమె హిందువుగా కూడా మారి పూజలు చేస్తూ వస్తోంది. అలా అని ఈమె ప్రేయర్ చేసుకోవడం మానెయ్యడం లేదు. అప్పుడప్పుడు చైతన్యను తీసుకుని చర్చ్ కు కూడా వెళ్తుంటుంది. ఇంట్లోనే ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉంటుందట మన అక్కినేని వారి ఇంటి కోడలు.

తాజాగా శివరాత్రిని పురస్కరించుకుని రకుల్, లక్ష్మి మంచు, శిల్పా రెడ్డి లతో కలిసి కోయంబత్తూర్ వెళ్ళింది సమంత.ఈ నేపథ్యంలో ఇషా ఫౌండేషన్ జగ్గీ వాసుదేవ్ నిర్వహించే శివరాత్రి ఉత్సవాల్లో వీరంతా కలిసి పాల్గొన్నట్టు తెలుస్తుంది. దానికి సంబదించిన ఫోటోనే ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఇక సమంత ప్రస్తుతం గుణశేఖర్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘శాకుంతలం’ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే.త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus