బ్రహ్మోత్సవం చిత్రంలోని డైలాగ్ ని అద్భుతంగా చెప్పిన లిటిల్ ప్రిన్సెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు కుమార్తె సితార టాలీవుడ్ క్రేజీ నటి సమంతను ఓడించింది. నిండా ఐదేళ్లు కూడా లేని లిటిల్ ప్రిన్సెస్ బ్రహ్మోత్సవం చిత్రంలో సమంత చెప్పిన “ఏడు తరాల.. వెతికితే దొరకనంత మందా.. కలిస్తే వదులుకోనంత మందా” అనే డైలాగ్ ని సింగిల్ టేక్ లో చెప్పి ఔరా అనిపించుకుంది. కుమార్తె ముద్దుగా చెప్పిన ఆ డైలాగ్ వీడియోని తల్లి నమ్రత శిరోత్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో మహేష్ అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. సితార చెప్పిన విధానం చూసి.. సమంత చాలా ముద్దుగా చెప్పమంటూ అభినందించింది.

సినిమాలో సమంత క్లిప్పింగ్, సితార క్లిప్పింగ్ ని జత చేసి   ప్రిన్స్ ఫ్యాన్స్ ట్విట్టర్లో ఉంచారు. ఆ వీడియోని కూడా చూసిన స్యామ్ “ఇక్కడ పోటీనే లేదు.. అయినా సితార గెలిచింది” అంటూ కామెంట్ చేసింది. మహేష్ సతీమణి నమ్రత తమ ముద్దుల కూతురు చేసే పనులను కొంతకాలంగా అభిమానులతో పంచుకుంటోంది. చాకోలెట్ తయారు చేయడం, కుండను చేసే వర్క్ షాప్ లో పాల్గొన్న సితార వీడియోలకు గతంలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో ఎక్కువగా లైక్ లు, షేర్లు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus