‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్ కోసం హిమాలయాలకు వెళ్ళాడు నాగార్జున. 3 వారాల పాటు అతను అక్కడే షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది. అందుకే నాగ్ హోస్ట్ చెయ్యాల్సిన ‘బిగ్ బాస్4’ కోసం..ఆయన కోడలు సమంత రంగంలోకి దిగింది. అందుతున్న సమాచారం ప్రకారం.. 5 వారాల పాటు ‘బిగ్ బాస్4’ ను హోస్ట్ చేయబోతుందట సమంత. అయితే ఈమె ఒక స్టార్ హీరోయిన్. ఈమె నటించే సినిమాలకు కోట్లల్లో పారితోషికం అందుకుంటూ వస్తుంది.
మరి ‘బిగ్ బాస్4’… 5 ఎపిసోడ్స్ హోస్ట్ చెయ్యడం కోసం ఎంత పారితోషికం అందుకోబోతుంది? అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంది. ‘బిగ్ బాస్’ నిర్వాహకులు.. సమంతకు ఈ 5 వారాలకు గాను ఏకంగా రూ.2.10 కోట్లు చెల్లించబోతున్నారని తెలుస్తుంది. అంటే ఒక్కో ఎపిసోడ్ కు రూ.40లక్షలు పైనే అన్న మాట. సీజన్ మొత్తం హోస్ట్ చెయ్యడం కోసం నాగార్జున రూ.8కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నాడు. ఈయనకు గత సీజన్ కు కూడా అంతే ఇచ్చారట ‘బిగ్ బాస్’ నిర్వాహకులు.
అయితే 5 ఎపిసోడ్స్ కే సమంతకు రూ.2కోట్ల వరకూ అందుకుంటుందంటే.. ఇక సీజన్ మొత్తం హోస్ట్ చేస్తే 10కోట్లకు పైనే అందుకుంటుందేమో. ఏమైనా బుల్లితెర పై కూడా సమంత సెన్సేషన్ సృష్టిస్తుందని స్పష్టమవుతుంది. నిన్నటి ఎపిసోడ్ కు కూడా భారీ టి.ఆర్.పి నమోదయ్యే అవకాశం ఉందని ‘బిగ్ బాస్4’ నిర్వాహకులు భావిస్తున్నారట.
Most Recommended Video
కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!