నాగ చైతన్యని మోసం చేశానని ఒప్పుకున్న సమంత!

టాలీవుడ్ ప్రేమ పక్షుల మధ్య చీటింగ్ జరిగిందా ? ప్రియుడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యని ప్రియురాలు సమంత మోసం చేసిందా?.. అవును ఇది నిజం.  సమంతే స్వయంగా ఒప్పుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో పరిచయమై, “మనం” చిత్రం తో దగ్గరై.. ప్రేమలో పడిన వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు.

ఇరుకుటుంబాల వాళ్లు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంగా కలిసి తిరుగుతున్నారు. తాజాగా చైతు నటించిన ప్రేమమ్ మూవీ హిట్ సాధించడంతో ఇద్దరూ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చైతు, స్యామ్ బ్యాడ్మింటన్ ఆడారు. అందులో సమంత గెలిచింది. ఇంకేముంది ఆనందంతో కోర్టు మొత్తం దొర్లేసింది. ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.

ఫోటోని పోస్ట్ చేసి గెలిచానని చెప్పుకుంది. దీంతో ఫ్యాన్స్ కూడా సంతోషంతో కంగ్రాట్స్ చెప్పారు. అప్పుడే క్రేజీ నటి అసలు విషయం బయట పెట్టింది. తన ప్రియుడిని చీట్ చేసి గెలిచినట్లు వివరించింది. ఇందుకు రియో ఒలింపిక్స్ విజేత పివి సింధు ఎలాగైనా గెలిచావు అంటూ సమంతకు విషెష్ చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus