ఇండస్ట్రీ తీరుపై మండిపడ్డ సమంత!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత పెళ్లి తరువాత కూడా తన కెరీర్ ను కంటిన్యూ చేస్తుంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క వెబ్ సిరీస్, టాక్ షోలు అంటూ కాలం గడుపుతుంది. తాజాగా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందనే సంగతి తెలిసిందే. కథలో హీరోకి సమానంగా హీరోయిన్ రోల్ ఉన్నప్పటికీ.. రెమ్యునరేషన్ విషయంలో మాత్రం హీరో దరిదాపుల్లో కూడా హీరోయిన్ ఉండదు.

ఈ విషయం గురించి చాలా మంది నటీమణులు ఓపెన్ గానే మాట్లాడారు. తాజాగా సమంత కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో టాప్ రేసులో ఉన్న హీరోయిన్ కి కనీసం టాప్ 20లో కూడా లేని హీరోకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువ ఇస్తారని చెప్పుకొచ్చింది. హీరోయిన్ గనుక రెమ్యునరేషన్ పెంచితే ఆమె ఆమె భారీగా డిమాండ్ చేస్తుందని.. అత్యాశకు పోతుందనే ముద్ర వేస్తారని.. అదే హీరో అడిగితే మాత్రం పెద్దగా అభ్యంతరం చెప్పరని తెలిపింది.

పైగా హీరో సక్సెస్ లో ఉన్నాడంటూ సమర్థిస్తుంటారని.. హీరోయిన్లు రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే మాత్రం ఒక క్రైమ్ లా చూస్తారంటూ తన మనసులో మాట బయటపెట్టింది. భవిష్యత్తులో అయినా.. హీరోయిన్లకు.. హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ ఇచ్చే రోజులు రావాలని సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధమవుతోంది. అలానే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ఓ సినిమాలో, తెలుగులో ‘శాకుంతలం’ సినిమాల్లో నటిస్తోంది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus