టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత తాజాగా నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోకపోవడంతో సమంత తన తదుపరి ప్రాజెక్టు పై దృష్టి సారించారు. అయితే ఈమె రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సిరీస్ హాలీవుడ్ వెర్షన్ లో ప్రియాంక చోప్రా నటిస్తున్నారు.
ఈ క్రమంలోనే హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా లండన్ లో ప్రీమియర్ షో వేశారు. ఈ క్రమంలోనే సమంతతో పాటు పలువురు సెలబ్రిటీలు ఈ ప్రీమియర్ షోలో పాల్గొన్నారు. ఈ ప్రీమియర్ షోలో భాగంగా సమంత లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ డ్రెస్సులో డైమండ్ జ్యువలరీ ధరించి అదిరిపోయే లుక్ లోఈమె దర్శనమిచ్చారు.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత ధరించిన డ్రెస్సు, డైమండ్ నగలపై అందరి దృష్టిపడింది. ఈ క్రమంలోనే వీటి ధర ఎంత ఉంటుందని ఆరా తీస్తున్నారు… ఈ క్రమంలోనే ఈ ప్రీమియర్ షోలో భాగంగా ఈమె ధరించిన డ్రెస్ 65 వేల రూపాయల ఖరీదు చేసిన విక్టోరియా బెక్ హామ్ క్రోచేట్ ప్యాచ్ వర్క్ స్కర్ట్ ధరించారు. ఈ డ్రెస్సుకు అనుగుణంగానే ఈమె అదిరిపోయే డైమండ్ జ్యువలరీ కూడా వేసుకున్నారు.
ఇక ఈ జువెలరీ ఖరీదు తెలిసే ప్రతి ఒక్కరు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. (Samantha) సమంత ధరించిన స్నేక్ నెక్లెస్ ధర 2.9 కోట్ల రూపాయలు కాగా ఆమె చేతికి ధరించిన బ్రేస్ 2.6 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తుంది. ఇలా ఈ ప్రీమియర్ షోలో సమంత అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అందరి దృష్టి ఈమెను ఆకర్షించిందని చెప్పాలి. ఇలా ఈ ప్రీమియర్ షోలో సమంత ధరించిన నగలు దుస్తుల విలువ తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.