వెబ్ సిరీస్ కోసం కూడా చాలా కష్టపడుతుందిగా..!

అక్కినేని వారి ఇంటి కోడలు సమంత ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రం.. తమిళంలో సూపర్ హిట్ అయిన ’96’ కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చినప్పటికీ.. ఎందుకో ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. అన్ సీజన్ వల్లే ఈ సినిమా బాగా ఆడలేదు అని కొందరు అంటుంటే.., ఇంత స్లో టేకింగ్ ఉన్న సినిమాలను మన ప్రేక్షకులు ఆదరించరు అని మరికొందరు అభిప్రాయపడ్డారు.

ఇది పక్కన పెడితే ఈ లాక్ డౌన్ సమయంలో సమంత ఖాళీగా ఉండకుండా ఓ సరికొత్త ప్రయోగం చేసిందట. అదేంటంటే ఇప్పుడు సమంత ‘ఫ్యామిలీ మెన్2’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఫ్యామిలీ మెన్2’ తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించబోతుంది సమంత. ఇందులో ఆమె పాత్రకి ఓన్ డబ్బింగ్ చెప్పుకోవాలి అని భావించి హిందీ నేర్చుకుందట. ఈ లాక్ డౌన్ సమయాన్ని మొత్తం అలాగే ఉపయోగించుకుందని తెలుస్తుంది.

బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని.. అక్కడి సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకోవాలి అనేది సమంత ప్లాన్ అయ్యుండొచ్చు. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ ఎపిసోడ్స్ లో కూడా సమంత కనిపిస్తుందట. అందుకోసం ఎన్నో వర్కౌట్ లు చేసిందని ఓ సందర్భంలో సమంతే చెప్పుకొచ్చింది.’ఈ వెబ్ సిరీస్ లో సరికొత్త సమంతను చూస్తారు’ అంటూ ఎంతో ధీమాగా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!</a

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus