‘నేను మయోసైటిస్ అనే రుగ్మతతో బాధపడుతున్నాను’ అంటూ ఆ మధ్య అనౌన్స్ చేసి అభిమానులకు, ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది సమంత. దాంతో చాలా మంది దాని గురించి వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో మయోసైటిస్ అంటే వ్యాధి కాదని, అదొక రుగ్మత అని తేలింది. అయితే దాని నుండి క్రమంగా కోలుకుంటున్న సమంత తన అనుభవాలను ప్రజలతో పంచుకోవడానికి ‘టేక్ 20’ పేరుతో హెల్త్ పాడ్‌కాస్ట్ ప్రారంభించింది. తొలి ఎపిసోడ్‌లో న్యూట్రీషనిస్ట్ అల్కేశ్ సమాధానాలిచ్చారు.
చాలామంది అభిప్రాయపడుతున్నట్లు మయోసైటిటస్ అనేది వ్యాధి కాదని చెప్పారు. వైరస్, బ్యాక్టీరియాల నుండి వ్యాధినిరోధక వ్యవస్థ కాపాడుతుందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అదే వ్యవస్థ తిరిగి మన శరీరంపై దాడి చేస్తే ఆటో ఇమ్యూన్ సమస్య వస్తుందని తెలిపారు. ఆధునిక జీవనశైలిని కారణంగా ఈ పరిస్థితి వస్తుంది. ఆహారం, పీచ్చే గాలి, ధరించే దుస్తులు, సౌందర్యోపకరణాలు.. ఇలా ఏవైనా దీనికి కారణం కావొచ్చు అని చెప్పారు.
తీవ్ర ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు ఆటో ఇమ్యూన్‌కు కారణాలు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి నిద్ర అవసరం. ఒక్కోసారి శరీరం నిద్రావస్థలో ఉన్నా మెదడు జీవితం గురించి ఆలోచిస్తుంటుంది. అది అప్పటికి ఓకే అయినా భవిష్యత్తులో ప్రభావం చూపిస్తుంది. తాజా ఆహారం తీసుకుంటూ… ఫిల్టర్ చేసిన నీరు తాగాలి. కాస్మోటిక్స్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి అని అల్కేశ్ చెప్పారు.
ఈ పాడ్ కాస్ట్ ఎపిసోడ్ విన్నాక, చూశాక… అభిమానులకు కలిగే మొదటి డౌట్. బ్యూటీ ప్రొడక్ట్స్, ఒత్తిడి. సమంత ఈ రెండింటి కారణంగా ఏమైనా మయోసైటిస్ బారిన పడిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పని ఒత్తిడి, నిజ జీవితంలో ఒత్తిడిని ఆమె ఎదుర్కొంది. గతంలో ఓసారి అనారోగ్యం కారణంగా చాలా నెలలు సినిమాలు మానేసింది. ఇక నటి కాబట్టి కాస్మొటిక్స్ వినియోగం తప్పనిసరి. దీంతో ఈ కారణాల వల్లే ఆమె (Samantha) ప్రస్తుతం సినిమాలు దూరంగా ఉంటుందా అని అంటున్నారు. ఎందుకంటే కెమెరా ముందుకొస్తే మళ్లీ ఈ రెండూ వస్తాయి.
భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!