సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకుందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది.. మెడలో తాళిబొట్టు, నల్లపూసల దండ, ముఖంలో కొత్తగా పెళ్లైన కళ.. ఇదీ సమంత కొత్త అవతారం.. దీంతో ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుందంటూ న్యూస్ చక్కర్లు కొడుతోంది.. సడెన్గా ఎవరికీ చెప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిందా ఏంటి?.. అంటూ చర్చించుకుంటున్నారు.. ఏదో ఒకలా విషయం బయటకి తెలిసేది కానీ.. సామ్ పక్కన ఈమధ్య మగ పురుగు ఎవ్వరూ కనిపించలేదు కదా మరి ఎవర్ని చేసుకుని ఉంటుందబ్బా! అని ఆశ్చర్య పోతున్నారు..
అసలేం జరిగిందంటే..
ఈ విషయం గురించి ఆరా తీస్తే తెలిసిందేంటంటే.. సమంత సెకండ్ మ్యారేజ్ చేసుకోలేదు.. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ మూవీ కోసం ఇలా రెడీ అయ్యిందంట.. ఓ సీన్ కోసం మెళ్లో పసుపుతాడు, నల్లపూసలు వేసుకుంది.. దీన్ని ఎవరో ఫోటో తీసి నెట్లో పెట్టడంతో సమంత రెండో పెళ్లి చేసుకుందంటూ వార్తలు రాసేస్తున్నారు.. సామ్ కారణంగానే ‘ఖుషి’ డిలే అయింది కానీ ఈ పాటికి రిలీజ్ కావాల్సింది..
నో పెళ్లి.. ఫోకస్ అంతా పని మీదే..
ఇక సమంత జీవితంలో కొద్ది రోజులు క్రితం జరిగిన పరిణామాలు తెలిసినవే.. నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని.. అతని నుండి విడిపోవడం అనేది ఆమె లైఫ్లో ఊహించని సంఘటన.. దాని నుండి బయట పడడానికి ప్రయత్నిస్తుండగా అనారోగ్యానికి గురవడం.. తిరిగి కోలుకుని మళ్లీ వర్క్ మీద ఫోకస్ చేయడం ఆశ్చర్యమే.. గుణ శేఖర్ దర్శకత్వంలో తొలిసారి నటించిన హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది..
ఇటీవలే ఫస్ట్ కాపీ రాగానే సినిమా చూసి.. అందరికీ తప్పకుండా నచ్చుతుందని కాన్ఫిడెంట్గా చెప్పింది.. అలాగే జూబ్లీ హిల్స్ పెద్దమ్మగుడిలో ప్రత్యేక పూజలు చేసింది.. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ తర్వాత ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కూడా సామ్ చేతిలో ఉంది..