టాలీవుడ్ క్రేజీ బ్యూటీ సమంత సంచలనాలకు మారు పేరు అవుతోంది. రోజుకో విశేషంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. మొన్నటి వరకు యువ సామ్రాట్ నాగచైతన్యతో ప్రేమ విషయంపై హాట్ టాపిక్ అయిన ఈమె, తాజాగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది. నిన్న ఇన్ స్ట్రాగ్రామ్ లో సమంత పెట్టిన వీడియోనే ఈ టాక్ కి కారణం. అందులో చైతూ లేదు. స్కిన్ షో అంతకన్నా లేదు. షూ, ట్రాక్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని క్యూట్ భామ జిమ్ లో వర్కవుట్ చేస్తోంది.
ఇందులో పెద్ద విశేషము ఏముందిలే అనుకుంటే పొరబాటే. అతి సుకుమారమైన ఈ బ్యూటీ ఒలింపిక్స్ లో పాల్గొనే వెయిట్ లిఫ్టర్ లా బరువులు మోస్తోంది. 10, 20 లేజీలు కాదు.. 72 కేజీల బరువున్న వెయిట్ తో వ్యాయామము చేస్తోంది. ఈ వీడియోని చూసిన అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా ఆశ్చర్యపోతున్నారు. సమంత స్టామినా చూసి అందరూ స్టన్ అయిపోతున్నారు. దీనికి గాళ్ పవర్ అని ట్యాగ్ చేసిన సమంత, నిజంగా అమ్మాయిలు అనుకుంటే ఏదైనా చేయగలరని చాటింది.