సమంత ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్ పనులలోను అలాగే ఖుషి సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె నటించిన శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది దీంతో తన తదుపరి ప్రాజెక్ట్ పై సమంత ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ నిమిత్తం ఈమె కేరళకు చేరుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
తాజాగా సమంత తన టీం తో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ ఈమె గ్వాలియన్ నుంచి కేరళకు వెళ్తున్నామని, ఖుషీ షూటింగ్ ఉందని సమంత తెలిపింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం రాత్రి జరుగుతుంది రాత్రి అంతా షూటింగ్ పనులతో బిజీగా ఉంటున్నామని పగలు మాత్రం ఇలా పార్టీలు చేసుకుంటూ ఉన్నామంటూ సమంత తెలియజేశారు. ఇలా సమంత ఈ సినిమా షూటింగ్లో భాగంగా నైట్ షెడ్యూల్స్ లో బిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది.
అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా (Samantha) సమంత అనారోగ్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.సమంతకు విజయ్ దేవరకొండకు ఈ సినిమా సక్సెస్ ఎంతో ముఖ్యమని చెప్పాలి.
విజయ్ దేవరకొండ కూడా గత కొద్దిరోజులుగా ఎలాంటి సక్సెస్ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అలాగే సమంత సైతం నటించిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోని వీరికి కుషి సినిమా ఎంతో కీలకంగా మారిందని చెప్పాలి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.