మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉపాసన ల కపుల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ మంచి మనసున్న.. అలాగే ఆదర్శమైన జంట అని చాలా మంది ప్రశంసిస్తుంటారు. ముఖ్యంగా ఉపాసన తన భర్త రాంచరణ్ కుటుంబం గురించి చాలా కేర్ తీసుకుంటూనే మరోపక్క సామజిక బాధ్యతలు కూడా చేపడుతూ ముందుకు సాగుతుంది. అందుకే ఈమెకు బోలెడంత మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైసామ్ లు కూడా ఓ విషయంలో చరణ్, ఉపాసన లనే ఫాలో అవుతున్నారు అంటూ కామెంట్స్ మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. చరణ్, ఉపాసన పెళ్లి చేసుకుని 8 ఏళ్ళు పూర్తిచేసుకున్నారు. అయినప్పటికీ వీరు ఇంకా పిల్లలు కావాలని తొందరపడడం లేదు .’అందుకు పెద్ద కారణమే ఉందని.. ముఖ్యంగా వారు సాధించాలి అనుకున్నది చాలా ఉందని’ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు చైసామ్ లు కూడా ఇలాంటి కారణమే ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ యాడ్ ద్వారా ప్రేక్షుకులను పలకరించారు చైసామ్ లు.! ఆ యాడ్లో సమంత పిల్లల డ్రెస్ లకు సంబంధించిన పిక్స్ ను చూపించి..
‘వీరు క్యూట్‌గా ఉన్నారు కదా’ అంటుంది. అందుకు చైతూ.. ‘ఇప్పుడు అలాంటివేం ప్లాన్ చెయ్యకు’ అని జవాబిస్తాడు. దీంతో ఇప్పట్లో పిల్లలను కనే ఉద్దేశం వారికి లేనట్టే హింట్ ఇచ్చారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ రకంగా చరణ్, ఉపాసన లకు మాదిరే.. చైసామ్ లు కూడా పిల్లల కోసం తొందర పడటం లేదని స్పష్టమవుతుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?