Samantha, Nayanthara: సమంత, నయన్ ఫుడ్ బోర్డ్ ప్రయాణం!

ఏదైనా సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తోంది అంటేనే ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఉంటుంది. అటువంటిది ఏకంగా ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ఒకే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అంటే దానిపై తారా స్థాయిలో అంచనాలు ఉంటాయని చెప్పక తప్పదు. అయితే మనం ప్రస్తుతం ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, తమిళ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా కాతువకుల రెండు కాదల్ అనే సినిమా తెరకెక్కుతోంది. మంచి యాక్షన్ తో కూడిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్స్ సమంత, నయనతార తొలిసారిగా కలిసి నటిస్తుండడం విశేషం.

యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తీస్తున్న ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన దగ్గరి నుడి మూవీపై అందరిలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై లో జరుగుతుండగా, సినిమాలోని ఒక సీన్ లో భాగంగా హీరో విజయ్ సేతుపతి తో కలిసి హీరోయిన్స్ సమంత, నయనతార ఇద్దరూ కూడా సిటీ బాస్ ఫుట్ బోర్డు పై ప్రయాణం చేయాల్సిన సీన్ ని నిన్న హెవీ క్రౌడ్ మధ్యన చిత్రీకరించింది యూనిట్.

అయితే ఆ సన్నివేశాన్ని తీస్తున్న సమయంలో అక్కడి కొందరు తమ కెమెరాల్లో దానిని బంధించి సోషల్ మీడియా మాధ్యమాల్లో అప్ లోడ్ చేయగా నేడు ఉదయం నుండి ఆ వీడియో ఎంతో వైరల్ అవుతోంది. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా రేపు విడుదల తరువాత ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus