Samantha: ఆ అందాన్ని చూసి మనసు పారేసుకున్న సామ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతున్న నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విడాకులు తీసుకున్న తర్వాత ఈమె వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈమె నటించిన శాకుంతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత విజయ్ దేవరకొండ జంటగా ఖుషి అనే సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

సినిమా షూటింగ్ పనులు కాశ్మీర్ లో శరవేగంగా జరుగుతున్నాయి. సమంత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కాశ్మీర్ అందాల గురించి పోస్ట్ పెట్టింది. అక్కడ ప్రకృతి అందాలను చూసి సామ్ మనపు పారేసుకుంది. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ ద్వారా కాశ్మీర్ గురించి ఎప్పుడు మనసులో తలచుకున్నా పెదాలపై చిరునవ్వు వస్తుందనీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కుటుంబ కథ ఈ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇది వరకే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమా పై భారీ అంచనాలు పెంచాయి. ఇదివరకే వీరిద్దరూ మహానటి సినిమాలో కలిసి కీలక పాత్రలో నటించారు. ఈ జోడి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పూర్తిగా తన కెరీర్ పై దృష్టి పెట్టారు.

ఈ క్రమంలోనే సమంత తెలుగు తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నాయి. సమంత విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 23న విడుదల కానుంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus