Samantha, Raj: సమంత – రాజ్‌ షికార్లు.. ఇప్పుడు శ్యామాలి ఏం పోస్టు పెట్టారో చూశారా?

ప్రముఖ కథానాయిక, సమంత, ప్రముఖ దర్శకుడు రాజ్‌ నిడిమోరు రిలేషన్‌లో ఉన్నారు అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వారి నుండి ఈ విషయంలో ‘స్నేహితులం మేం’ అనేలా రిప్లై వస్తున్నా.. వారి ట్రిప్‌లు, ఫొటోలు చూస్తే అలా అనిపించడం లేదు. మొన్నీ మధ్య వరకు మన దేశంలో వివిధ ప్రదేశాల్లో కనిపించిన ఈ జంట ఇప్పుడు విదేశాల్లో ట్రిప్‌లకు వెళ్తున్నట్లున్నారు.

Samantha, Raj

తాజాగా సమంత, రాజ్‌ ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. దీంతో గతంలో సమంత, ఆమె అభిమాన గణం చేసిన కామెంట్లు బయటికొచ్చాయి. సమంత ఇటలీవల అమెరికా వెకేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. వాటిలో రాజ్‌తో దిగిన ఫొటోలు కూడా ఉన్నాయి. ‘మీరు అదృష్టవంతులు కారు.. మీ కష్టానికి ప్రతిఫలం వచ్చింది’ అనే కొటేషన్‌ను ఆ ఫొటోలతో ఆ పోస్టులో రాసుకొచ్చింది సమంత.

ఈ లెక్కన ఆ ప్రతిఫలం ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఫొటోల కారణమో లేక సాధారణంగా పెట్టారో కానీ రాజ్‌ భార్య శ్యామాలి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టారు. ‘ఇతరులను బాధపెట్టకూడదు.. అలాంటి బాధ మనకు వస్తే..’ అనేలా అందులో రాసుకొచ్చారు. ఇక ఈ ఫొటోలు చూశాక సమంత గతంలో అన్యాపదేశంగా చేసిన కామెంట్లు, ఆమె ఫ్యాన్స్‌, సన్నిహితులు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

అందులో ఎక్కువ శాతం నాగచైతన్య, శోభిత చుట్టూనే ఉండేవి. పెళ్లయిన వ్యక్తి, కొత్త రిలేషన్‌ ఇలా సమంత ఫ్యాన్స్‌ మాట్లాడేవారు. సమంత కూడా తన రిలేషన్‌ షిప్‌ బ్రేక్‌ విషయంలో వెనుక జరిగిన విషయాలు అంటూ తన మాజీ పార్ట్‌నర్‌ని కార్నర్‌ చేసింది. మరిప్పుడు పెళ్లయిన రాజ్‌తో ఆమె ఇలా చక్కర్లు, ట్రిప్‌లు ఎందుకు.. లేని పోని వివాదాలు ఎందుకు? అనే ప్రశ్న వినిపిస్తోంది.

విజయ్ దేవరకొండకి.. ఈసారి కూడా పెద్ద టాస్కే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus