Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

టంపాలో జరిగిన ‘NATS 2025’ వేడుకల్లో టాలీవుడ్ స్టార్ వెంకటేష్ (Venkatesh) సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేజిపై తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలిపి అందరిలో క్యూరియాసిటీ ఏర్పడేలా చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు మనకి మంచి ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. మీ అందరితో పాటు నేను కూడా ఈ ప్రాజెక్టు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

Venkatesh

అలాగే చిరంజీవి గారి సినిమాలో ఒక కామియో చేస్తున్నాను. చాలా ఫన్నీ గా ఉంటుంది అది కూడా. దాని తర్వాత మీనాతో కలిసి ‘దృశ్యం 3’ చేయబోతున్నాను. దాని తర్వాత మళ్ళీ అనిల్ రావిపూడితో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ ఉంటుంది. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక నా స్నేహితుడు నందమూరి బాలకృష్ణతో (Balakrishna) కలిసి ఓ పెద్ద సినిమా చేయబోతున్నాను” అంటూ ఆసక్తికర విషయాలు తెలిపారు వెంకటేష్ (Venkatesh) .

వీటిలో చాలా వరకు అందరికీ తెలిసిన అప్డేట్స్. కానీ బాలకృష్ణతో (Balakrishna) వెంకటేష్ (Venkatesh) ఒక సినిమా చేస్తాను అని చెప్పడం అందరికీ షాకిచ్చింది. అసలు ఎవ్వరూ ఊహించని కాంబో ఇది. ఏ దర్శకుడు వీరి కాంబోని సెట్ చేశాడు? అనేది అందరిలోనూ ఆసక్తి పెంచే అంశం. మరి దాని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సీనియర్ స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్లు చేయాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటున్నారు. కానీ సీనియర్ స్టార్ హీరోలు మాత్రం ఈ విషయంపై ఏదో ఒక సాకు చెప్పి దాటేస్తూ వచ్చారు. మొత్తానికి ఇప్పుడు వెంకటేష్ (Venkatesh) ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయబోతున్నట్టు స్పష్టమవుతుంది.

దర్శకుడు రమేష్ వర్మ ప్లానింగ్ బాగుంది..కానీ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus