Nithiin: ‘తమ్ముడు’ ఎఫెక్ట్ ‘ఎల్లమ్మ’ పై పడిందా..?

‘ఎల్లమ్మ’.. ‘బలగం’ వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వేణు దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ఇది. ముందుగా నానితో ఈ ప్రాజెక్టు చేయాలని అనుకున్నారు. కానీ నాని వరుస కమిట్మెంట్స్ వల్ల ఈ ప్రాజెక్టు చేయడానికి అతను ఇంట్రెస్ట్ చూపించలేదు. కొంచెం డివోషనల్ టచ్ ఉన్న కథ ఇది. అందుకే తేజ సజ్జని కూడా సంప్రదించారు. అతనికి కథ నచ్చింది. కానీ అతను కూడా మరో 2 ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న కారణంగా ఇది చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఫైనల్ గా నితిన్ చేయడానికి ఒప్పుకున్నాడు.

Nithiin

దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ ఇటీవల వీరి కాంబినేషన్లో ‘తమ్ముడు’ వచ్చింది. మొదటి షోతోనే అది ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దిల్ రాజుకు ఈ ప్రాజెక్టు రూపంలో 30 శాతం నష్టాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. నితిన్ (Nithiin) మార్కెట్ కి మించిన బడ్జెట్ పెట్టి దిల్ రాజు పెట్టి తీసిన సినిమా ఇది. రికవరీ జరగలేదు.

ఇప్పుడు ‘ఎల్లమ్మ’ కి కూడా బడ్జెట్ ఎక్కువే పెట్టాలి. క్లైమాక్స్ 45 నిమిషాల ఎపిసోడ్..కే రూ.25 కోట్ల వరకు బడ్జెట్ పెట్టాలట. అప్పుడు సినిమా మొత్తానికి ఎంత అవుతుంది? ‘తమ్ముడు’ కి రూ.75 కోట్లు పెట్టారు. ‘ఎల్లమ్మ’ కి రూ.100 కోట్లు బడ్జెట్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. నితిన్ (Nithiin) సినిమాకి రూ.60 కోట్లు బిజినెస్ జరగడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఎల్లమ్మ’ కి అంత బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్. ‘తమ్ముడు’ కి నితిన్ అడ్వాన్స్ మినహా పారితోషికం తీసుకోలేదు. ‘ఎల్లమ్మ’ ఉంది కదా అని రాజీ పడినట్టు టాక్.

కంటెంట్ బాగుంటే రూ.100 కోట్లు రికవరీ అవ్వడం కష్టమేమి కాదు. కానీ ప్రస్తుతం నితిన్ (Nithiin) – దిల్ రాజు ఫామ్లో లేరు. మరోవైపు స్క్రిప్ట్ లో మళ్ళీ మార్పులు కావాలని దిల్ రాజు కోరారట. అందుకోసం వేణుతో కలిసి ఒకసారి కూర్చుని దానిపై వర్క్ చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా నటీనటుల ఎంపిక పూర్తయ్యింది. అయినప్పటికీ ‘ఎల్లమ్మ’ని కొన్నాళ్ళు హోల్డ్ లో వేయక తప్పేలా లేదు.

మరోసారి చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు.. ఏమైందంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus