మొదటి గోల్ కొట్టిన సమంత!
- September 2, 2017 / 01:08 PM ISTByFilmy Focus
ప్రతి ఒక్కరికీ గోల్స్ మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేస్తే అప్పుడు వచ్చే ఆనందం అంత ఇంతాకాదు. అలాంటి ఎన్నో గోల్స్ ను సాధించిన సమంత.. తాజాగా వెడ్డింగ్ గోల్స్ లో ఒక దానిని పూర్తి చేసింది. అక్టోబర్ లో నాగచైతన్యతో ఏడడుగులు వేయనుంది. ఆ లోపున తాను నటించే సినిమాలన్నిటినీ కంప్లీట్ చేయాలనీ అనుకుంది. మొదటిగా రాజుగారి గది-2 సినిమాని పూర్తి చేసినట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంది. సెప్టెంబరు 20న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది.
పీవీపీ సినిమా పతాకంపై నిర్మితమవుతున్న ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీలో తన షూటింగ్ కంప్లీట్ కావడంతో మిగతా ఐదింటిని పూర్తి చేసే ఆలోచనలో సమంత ఉంది. తెలుగులో రంగస్థలం1985, మహానటి చిత్రాల్లో నటిస్తుండగా, తమిళంలో విజయ్ హీరోగా నటించే 61, ఇరుంబు తిరాయ్, అనేతి కథైగల్ సినిమాల్లో సమంత నటిస్తోంది. ఈ సినిమాలు అక్టోబర్ నాటికీ కంప్లీట్ చేయడమే లక్ష్యంగా సమంత కష్టపడుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















