గత కొన్ని రోజులుగా అక్కినేని అభిమానులను ఎంతగానో బాధిస్తున్న విషయంపై మొత్తానికి సమంత నాగ చైతన్య క్లారిటీ ఇచ్చేసి మరింతగా బాధ పెట్టారు. వారు భార్య భర్తల అనుబంధానికి స్వస్తి చెబుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఈ సున్నితమైన విషయాన్ని గత కోన్ని రోజులుగా ఎలా చెప్పాలా అని ఆలోచించిన ఈ స్టార్స్ ఫైనల్ గా సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చేశారు.
నాగ చైతన్య సమంత ఇద్దరు కూడా దాదాపు ఒకే తరహాలో వివరణ ఇచ్చారు. ఇక సమంత ఈ విధంగా వివరణ ఇచ్చింది. మా శ్రేయోభిలాషులందరికీ చాలా చర్చలు మరియు ఆలోచనల తరువాత ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. చై మరియు నేను మా స్వంత మార్గాలను అనుసరించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేము ఒక దశాబ్దానికి పైగా స్నేహం కలిగి ఉండటం మా అదృష్టం అనే చెప్పాలి.
మా స్నేహం ఎంతో ప్రధానమైంది. ఇది ఎల్లప్పుడూ ప్రత్యేకతను కలిగి ఉంటుందని మేము నమ్ముతున్నాము. అయితే ఈ క్లిష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని మా అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు మీడియాను మేము అభ్యర్థిస్తున్నాము. అలాగే మీ సపోర్ట్ కోసం మేము మీకు కృతజ్ఞతలు తెలియజేయడానికి అవసరమైన ప్రైవసినీ మాకు అందించండి.. అంటూ సమంత వివరణ ఇచ్చారు. ఇక వీరు విడిపోవడానికి అసలు కారణం ఏమిటి అని విషయంలో ప్రస్తుతం అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.