Samantha: టాటూ లేదు అని చెప్పడానికే సమంత ఈ ఫోజ్ ఇచ్చిందా?

నాగ చైతన్య, సమంత.. 2017 లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 4 ఏళ్ళ పాటు క్యూట్ కపుల్, బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్లినా.. ఏ ఫంక్షన్ లో కనిపించినా.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేవారు. సోషల్ మీడియాలో నిత్యం వీళ్ళ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉండేవారు.ఇలాంటి కపుల్ విడిపోతారు అని ఎవ్వరూ కలలో కూడా అనుకోలేదు. అలాంటిది 2021 అక్టోబర్ 2 న విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది అందరికీ షాకిచ్చారు.

కెరీర్ లో ఎదగాలనే ఉద్దేశంతోనే చైసామ్..లు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు. తర్వాత ఎవరి సినిమాలతో వాళ్ళు బిజీ అయిపోయారు లెండి. ఇదిలా ఉండగా.. విడాకుల తర్వాత సమంత మళ్ళీ గ్లామర్ రోల్స్ చేయడం మొదలుపెట్టింది.అలాగే గ్లామర్ ఫోటో షూట్ల జోష్ కూడా పెంచింది అని కూడా చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. నాగ చైతన్యని తన ఫ్యామిలీ మెంబర్స్.. అలాగే ఇండస్ట్రీలో అతని ఫ్రెండ్స్.. అతన్ని ముద్దుగా ‘చై’ అని పిలుస్తుంటారు.

పెళ్ళైన కొత్తలో సమంత కూడా ‘చై’ పేరును తన రిబ్స్ పై టాటూగా వేయించుకుంది.గతంలో ఆ టాటూ కనిపించేలా ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చింది. ఇక ప్రస్తుతం సమంత దుబాయ్ లో ఉంది. అక్కడ ఓ వేడుకలో పాల్గొన్న సామ్.. కెమెరాలకు ఫోజులు ఇచ్చింది. పింక్ కలర్ శారీలో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రిబ్స్ కనబడేలా (Samantha) సమంత ఫోజులు ఇచ్చింది. అయితే ఆమె రిబ్స్ పై ‘చై’ పేరు లేదు. ఆ టాటూను సమంత తొలగించినట్టు స్పష్టమవుతుంది. అందుకే సోషల్ మీడియాలో పాత ఫోటోలను, ఇప్పటి ఫోటోలను పోల్చి చూసి .. కొందరు నెటిజన్లు ఈ విషయాన్ని చర్చించుకుంటున్నారు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus