Samantha: గాయం మానుతోంది అనుకుంటుంటే… సమంత మళ్లీ గిచ్చి పెంచుతోందా?

జరిగాల్సింది ఏదో జరిగిపోయింది… ఇప్పుడు ఆ విషయం మళ్లీ ఎందకు పట్టించుకోవడం అని అంటుంటారు పెద్దలు. గతాన్ని మరచిపోయి ముందుకు వెళ్లాలి అని కూడా అంటారు. అలా కొందరు మరచిపోదాం అనుకుంటున్నా కొంతమంది మరచిపోకుండా ఏదో ఒకటి చేస్తున్నారు. ఏదో గొప్ప పని చేసేసింది అన్నట్లుగా సోషల్‌ మీడియాలో రాసుకొస్తుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇప్పుడు సమంత (Samantha) పోస్టును చూసి అదే మాట అంటున్నారు నెటిజన్లు. సినిమాలకు కాస్త దూరం పెట్టి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న సమంత చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ముంబయి వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరైంది. ఈ క్రమంలో తాను ధరించిన గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నాకెంతో ఇష్టమైన గౌనును రీమోడలింగ్ చేయించి ధరించి ఈ వేడుకకు హాజరవ్వడం సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది సమంత. ఆ గౌనును మరింత అందంగా డిజైన్ చేసిన క్రేశా బజాజ్‌కు కృతజ్ఞతలు చెప్పిన సమంత..

జీవితంలో అలవాట్లు మార్చుకోవడం, పాత దుస్తులను రీమోడలింగ్ చేయించి ధరించడం తన లైఫ్ స్టయిల్‌ అని చెప్పింది సమంత. ఇక ఆ గౌను సంగతి చూస్తే.. నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత గోవాలో 2017లో హిందూ, క్రిస్టియన్ పద్ధతుల్లో వివాహం చేసుకున్నారు. దీని కోసం 2016 ఆఖరులోనే ఓ గౌనును డిజైన్‌ చేయించింది సమంత. అయితే వ్యక్తిగత కారణాలతో 2021లో ఈ దంపతులు విడిపోయారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus