కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్లో భాగంగా మనాలీ వెళ్ళాల్సి వచ్చింది. అయితే గతవారం ‘బిగ్ బాస్4’ ఎపిసోడ్ ను ఎవరు హోస్ట్ చేస్తారని.. అంతా డిస్కస్ చేసుకున్న తరుణంలో రమ్యకృష్ణ, రోజా వంటి వారి పేర్లు కూడా వినిపించాయి. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా తన కోడలు సమంతను రంగంలోకి దింపాడు నాగార్జున. దసరా స్పెషల్ ఎపిసోడ్ ను సమంత హోస్ట్ చెయ్యడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి.
మొదటిసారి హోస్ట్ చేసినప్పటికీ మంచు మార్కులనే కొట్టేసింది సమంత. ఈ నేపథ్యంలో ‘బిగ్ బాస్’ ను హోస్ట్ చెయ్యడం పై సమంత తన మనసులోని భావాలను.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సమంత మాట్లాడుతూ.. “నేను గతంలో బిగ్ బాస్ కు సంబంధించి ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు.మునుపెప్పుడూ యాంకరింగ్ చేసిన అనుభవమే లేదు. తెలుగు సరిగా మాట్లాడగలనో లేదో అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు ఎప్పుడూ చెయ్యలేదు. అందుకే మావయ్య బిగ్ బాస్ ను హోస్ట్ చెయ్యమని అడిగినప్పుడు..
మొదట నేను చాలా భయపడ్డాను. అలాంటివేమీ పట్టించుకోకుండా… కేవలం నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించినందుకు థ్యాంక్యూ మామ. ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తరువాత ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్” అంటూ సమంత చెప్పుకొచ్చింది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?