ఆ బోల్డ్ డైరెక్టర్ తో సమంత చేస్తుందా?

ఒక్క సినిమాతో సంచలన దర్శకుడిగా మారిపోయాడు అజయ్ భూపతి. బోల్డ్ కంటెంట్ తో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్స్ గా చేసిన ఆర్ ఎక్స్ 100 సంచలన విజయం సాధించింది. ప్రేమ కథలో ప్రేమికురాలిని విలన్ ని చేస్తూ ఆయన చేసిన ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. కాగా ఈ దర్శకుడు రెండేళ్ల నుండి మరో చిత్రం చేయలేదు. మహా సముద్రం అనే సినిమా రవితేజ తో చేయడానికి ప్రయత్నించారు. కారణాలేమైనా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. అజయ్ భూపతి, రవి తేజ మధ్యలో ఈ చిత్రం విషయమై కొంచెం వివాదం కూడా నడిచింది.

ఐతే మహా సముద్రం చిత్రాన్ని శర్వానంద్ తో అజయ్ చేస్తున్నారు. మరో సంచలన విషయం ఏమిటంటే సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు ఒప్పుకున్నారట.దర్శకుడు అజయ్ భూపతి చెప్పిన స్క్రిప్ట్ ఆమెకు నచ్చడంతో ఈ మూవీ పట్ల సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. దీనిపై అధికారిక సమాచారం ఏమి లేకపోయినప్పటికీ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. మహాసముద్రం మూవీ విశాఖ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కనుందని వినికిడి. పాత్ర రీత్యా సమంత చక్కగా సరిపోతుందని దర్శకుడు భావించి ఆమెను సంప్రదించారట. ఇప్పటికే శర్వానంద్, సమంత కలిసి నటించిన జాను విడుదలకు సిద్దమైంది. వచ్చే నెలలో ఈ మూవీ విడుదల కానుంది. తమిళ చిత్రం 96కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ నిన్న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఇక మహా సముద్రం లో కూడా సమంత నటించినట్లైతే వీరు కలిసి నటిస్తున్న రెండవ చిత్రం అవుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
దర్బార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus