రెండు రోజుల తేడాలో సమంత రెండు సినిమాలు రిలీజ్.!

క్యూట్ బ్యూటీ సమంత రామలక్ష్మిగా నటించిన రంగస్థలం సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సస్ ని ఎంజాయ్ చేసే సమయం కూడా ఆమెకు లేదు. ప్రస్తుతం సమంత మూడు సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ లో హిట్ సాధించిన “యూ టర్న్” ను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం  వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక  డైరక్టర్ త్యాగరాజన్‌ దర్శకత్వంలో  “సూపర్‌ డీలక్స్‌” అనే సినిమాని చేస్తున్నారు. ఇందులో విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తుండగా, సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే శివ కార్తికేయన్ తో సీమ రాజా అనే మూవీ చేస్తోంది. ఈ మూడు ఈ ఏడాది ద్వితీయార్ధంలో థియేటర్లో సందడి చేయనున్నాయి.

వీటికంటే ముందు సమంత నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. అవి సావిత్రి బయోపిక్ మూవీ మహానటి. రెండోది  “ఇరుంబు తిరై(అభిమన్యుడు)”.  వైజయంతి మూవీస్ బ్యానర్, స్వప్న సినిమా బ్యానర్లపై అశ్వినీదత్, స్వప్నదత్ లు కలిసి నిర్మిస్తున్నసినిమా మహానటి. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత జర్నలిస్ట్ మధురవాణిగా కనిపించనుంది. ఈ మూవీ మే 9 న రిలీజ్ కానుంది. ఇక విశాల్ హీరోగా తెరకెక్కిన ఇరుంబు తిరై(అభిమన్యుడు)” తమిళం, తెలుగులో మే 11 న రిలీజ్ కానుంది. సో రెండురోజుల తేడాలో కోలీవుడ్, టాలీవుడ్ లో సమంత నటించిన రెండు సినిమాలు హంగామా చేయనున్నాయి. ఇవి కూడా హిట్ అయితే సమంత రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus