డైరక్టర్ కండిషన్ కి ఒప్పుకోక నో చెప్పిన సమంత
- December 16, 2016 / 06:01 AM ISTByFilmy Focus
అలనాటి మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న మూవీలో సమంత నటిస్తుందని ఆమె అభిమానులను సంబరపడ్డారు. తాజాగా సావిత్రిగా నటించనంటూ క్రేజీ బ్యూటీ తేల్చి చెప్పేసింది. సమంత ఎస్, నో చెప్పడానికి మధ్య ఏమి జరిగింది?.. వివరాల్లోకి వెళితే.. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న డైరక్టర్ నాగ్ అశ్విన్. అతను రెండో చిత్రానికి సావిత్రి లైఫ్ ని కథగా ఎంచుకున్నారు. ఆమె జీవితంలో అందరికి తెలిసిన సంగతులు కాకుండా, తెలియని కోణాన్ని వెండి తెరపై చూపించడానికి రెండేళ్లుగా శ్రమిస్తున్నారు.
స్క్రిప్ట్ ని సిద్ధం చేసిన ఈ యువ డైరక్టర్ సావిత్రి పాత్రను పోషించే భామకు కొంతకాలంగా వేట సాగిస్తున్నారు. తొలుత విద్యాబాలన్, నిత్యామీనన్ లను సంప్రదించిన నాగ్ అశ్విన్ చివరికి సమంతకు ఫిక్స్ అయ్యారు. మంచి పాత్ర, వైజయంతీ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తుండడంతో ఆమె కూడా సంతోషంగా ఒప్పేసుకుంది. తర్వాతే మెల్లగా డైరక్టర్ కొంత లావు కావాలని అని అసలు విషయం చెప్పారు. దీంతో షాక్ తిన్న స్యామ్ “కష్టపడి ఈ బాడీని సొంతం చేసుకున్నాను.. లావు కావడం నా వల్ల కాదు” అని మొహం మీదే చెప్పేసిందట. దీంతో నాగ్ అశ్విన్ పని మళ్ళీ మొదటికి వచ్చింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













