Samantha: సమంత సినిమాకి ఓవర్ బడ్జెట్!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు గుణశేఖర్. ఆయన సినిమాలన్నీ భారీగా ఉంటాయి. చిన్న కథైనా.. చాలా గ్రాండ్ గా చెబుతుంటారు గుణశేఖర్. సెట్స్ కోసం కోట్లలో ఖర్చు చేస్తుంటారు. అందుకే అనుకున్న బడ్జెట్ లో సినిమాలను పూర్తి చేయలేరు. ఆయన డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. తాజాగా ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘శాకుంతలం’ కూడా బడ్జెట్ దాటేసిందట. ఈ సినిమాను ముందుగా రూ.50 కోట్లలో నిర్మించాలని అనుకున్నారు.

కానీ ఇప్పుడు మొత్తం బడ్జెట్ రూ.65 కోట్లు దాటేసింది. ఇంకా ప్రీ ప్రొడక్షన్, ప్రమోషన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పుడు సమంత ఆరోగ్యం ఏమంత బాలేదు. ప్రస్తుతం ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆమె కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ‘శాకుంతలం’ ప్రమోషన్స్ లో పాల్గొనాలంటే సమంత యాక్టివ్ అవ్వాలి. ఆమె వచ్చే వరకు వెయిట్ చేయనుంది ‘శాకుంతలం’ టీమ్. ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ కాదు. దీంతో సినిమాపై వడ్డీల భారం పడనుంది.

అయినప్పటికీ.. గుణశేఖర్ ధీమాగానే ఉన్నారట. ఎందుకంటే.. ‘శాకుంతలం’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇదో విజువల్ ఫీస్ట్ కాబట్టి భాషకు అతీతంగా సినిమాను చూస్తారనేది గుణశేఖర్ నమ్మకం. త్వరలోనే ‘యశోద’ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ‘యశోద’ గనుక హిట్ అయి..

మంచి కలెక్షన్స్ రాబడితే.. అది ‘శాకుంతలం’కి ప్లస్ అవుతుంది. అందుకే ‘యశోద’ రిజల్ట్ ఏమవుతుందా..? అని గుణశేఖర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 11న ‘యశోద’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus