టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ను పెంచుకుంటున్నారు. ఒక్కో సినిమాకు 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో సామ్ వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. సామ్ మాట్లాడుతూ ఈ దీపావళి సినీ అభిమానులకు మరింత వినోదాన్ని పంచనుందని అన్నారు. ది మార్వెల్స్ ప్రమోషన్స్ లో నేను భాగం కావడం థ్రిల్లింగ్ గా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.
ది మార్వెల్స్ ప్రమోషన్స్ కోసం నేను భాగం కావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని సమంత కామెంట్లు చేశారు. చెడుపై మంచి సాధించే అంతిమ యుద్ధం కోసం ఈసారి ఒకరు కాదు ఏకంగా ముగ్గురు సూపర్ హీరోలు పోరాడనున్నారని సమంత చెప్పుకొచ్చారు. ఈ యాక్షన్ మూవీ పండుగను మరింత ప్రత్యేకం చేయనుందని సామ్ తెలిపారు. థియేటర్లో చూసి సర్ప్రైజ్ కావడానికి అందరూ సిద్ధంగా ఉండాలని సామ్ పేర్కొన్నారు.
నేను అవెంజర్ అయితే మా ఫ్యాన్స్ తో కలిసి ప్రపంచాన్ని కాపాడతానని సమంత తెలిపారు. సినిమా రంగానికి చెందిన వారితో అయితే బన్నీ, విజయ్, ప్రియాంక చోప్రా, ఆలియాతో కలిసి ప్రపంచాన్ని కాపాడతానని సామ్ కామెంట్లు చేశారు. నా లైఫ్ లో ఉన్న ముగ్గురు సూపర్ హీరోల గురించి చెప్పాలంటే మా అమ్మ అని అమ్మ నాకెంతో ధైర్యాన్ని ఇచ్చిందని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమ్మతో పాటు నా స్నేహితులు, నా పెట్స్ కూడా నాకు సూపర్ హీరోలతో సమానమని సమంత పేర్కొన్నారు. ఈ దీపావళికి మంచి సినిమాలు విడుదలవుతున్నాయని అన్నీ భిన్నమైన జోనర్లకు చెందినవని సమంత అన్నారు. ఆ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని కోరుకుంటున్నానని సమంత తెలిపారు. సమంత (Samantha) చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.