సమంత సంచలన కామెంట్లు వైరల్..!

Ad not loaded.

ఈ ఏడాది ‘జాను’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది సమంత. తమిళ సూపర్ హిట్ చిత్రం ’96’ కు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే. త్వరలో సమంత ‘ఫ్యామిలీ మెన్ సీజన్2’ వెబ్ సిరీస్ ద్వారా కూడా ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉండగా.. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న తరువాత నాగ చైతన్య, సమంత లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా వీళ్లకు సంతానం లేదు. ‘నేను కంప్లీట్ ఫ్యామిలీ పర్సన్ కావాలనుకుంటున్నాను’ అంటూ సమంత ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా.. “నేను అమ్మగా ఫెయిల్ అయ్యాను. నా కొడుకు ఓ దొంగ. వాడు పక్క ఇంట్లో బాంబీని దొంగలించాడు’ అంటూ సమంత తన ఇన్స్టా గ్రామ్ లో కామెంట్ చేసింది. ఈ కామెంట్లు చూసి ఎవ్వరైనా కంగారు పడటం కామన్. అయితే సమంత ఈ కామెంట్లు తన పెంపుడు కుక్క గురించి చేసింది .మరో ఫోటోలో తన హష్‌ (మరో పెంపుడు కుక్క) ఫోటోను షేర్‌ చేసి.. ‘అది అలిగింది’ అంటూ కూడా కామెంట్ పెట్టింది. సమంతకు తన పెంపుడు కుక్కలు అంటే బాగా ఇష్టం.

అయితే సమంత పరిచయమయ్యే ముందు వరకూ నాగ చైతన్యకు కుక్కలు అంటే ఇష్టం ఉండేది కాదంట.అవి దగ్గరకు వస్తేనే చిరాకు పడిపోయేవాడట. అయితే సమంత.. చైతన్య జీవితంలోకి వచ్చాక.. పెంపుడు కుక్కలను ఇష్టపడటం మొదలు పెట్టాడని సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక ఈ లాక్ డౌన్ లో సమంత ఓ కోచ్ ను పెట్టుకుని మరీ వంటలు నేర్చుకుంటున్న ఫోటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus