హాట్ టాపిక్ గా మారిన సమంత కామెంట్స్..!

అక్కినేని సమంత ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ రేంజ్లో దూసుకుపోతుంది. చెప్పాలంటే పెళ్ళైన తరువాత ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ‘రంగస్థలం’ ‘మహానటి’ ‘ఓ బేబీ’ ‘అభిమన్యుడు’ వంటి చిత్రాలు ఈమె స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు. కథా ప్రాధాన్యత ఉండే చిత్రాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది సమంత. ఇదిలా ఉండగా.. అప్పుడప్పుడు ఈమె చేసే కామెంట్స్ కూడా పెద్ద చర్చకు దారి తీస్తుంటాయి అన్న సంగతి తెలిసిందే.

తాజాగా మరోసారి ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ హీరోల గురించి అలాగే హీరోయిన్ల కెరీర్ గురించి ఈమె బోల్డ్ కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ.. “ఫ్లాపులొచ్చినా.. హీరోల కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు.కానీ హీరోయిన్లకు మూడు నాలుగు ఫ్లాపులు వచ్చాయి అంటే మాత్రం ఇక కెరీర్ క్లోజ్ అయిపోయినట్టే.! హీరోయిన్స్ ఎంత కష్టపడినా ప్రేక్షకులకు అంత నచ్చదు. ఓ సినిమా హిట్ అయ్యింది కదా అని పదే పదే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూడరు.

అయితే ఓ స్టార్ హీరో స్క్రీన్‌పై అలా నడుచుకుంటూ వస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంటారు. హీరోలకు ఉండే క్రేజ్ అలాంటిది” అంటూ చెప్పుకొచ్చింది సమంత. ప్రస్తుతం ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus