నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉండడంతో… ఆయన కోడలు సమంత హోస్ట్ చేసి షోకి మంచి కల తెప్పించింది.ఈమెకు తెలుగు సరిగ్గా రాదు కదా.. షోని హోస్ట్ చేయగలదా? అని చాలా మంది ప్రశ్నించారు.కానీ సమంత హోస్ట్ చెయ్యడంలో మామకు తగ్గ కోడలు అనిపించుకుంది. ఇదిలా ఉండగా.. ఈ వారం కూడా నాగార్జున మనాలీలోనే షూటింగ్ చెయ్యబోతున్నాడు. మరి ఈ వారం కూడా సమంతనే హోస్ట్ చెయ్యబోతుందా? అంటే..
కొంతమంది అవుననే సమాధానం ఇస్తున్నారు. మరికొందరైతే కాదు.. అనే సమాధానం ఇస్తున్నారు. అందుతోన్న సమాచారం ప్రకారం.. ఒక్క ఎపిసోడ్ ను మాత్రమే సమంత హోస్ట్ చెయ్యడానికి అంగీకరించిందట. ఈ వారం మరో గెస్ట్ .. హోస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. రమ్యకృష్ణ లేదా రోజా వంటి వారు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ను హోస్ట్ చేసే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
అయితే గత శనివారం హోస్ట్ లేకుండా కూడా షోని కొనసాగించారు. కాబట్టి ఈసారి కూడా హోస్ట్ లేకుండా కొనసాగించినా ఆశ్చర్యపడనవసరం లేదు.అయితే హోస్ట్ ఉండేది.. లేనిది ఈ శుక్రవారం నాడు.. ఓ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?