Shaakuntalam: ‘శాకుంతలం’ కి డబ్బింగ్ చెప్తూ ఎమోషనల్ పోస్ట్ చేసిన సమంత..

సౌత్ క్వీన్ సమంత ఎప్పుడైతే తనకు సోకిన మయోసిటీస్ అనే అరుదైన వ్యాధి గురించి బయట పెట్టిందో అప్పటినుండి ఆమె వార్తల్లో నిలిస్తూ వస్తోంది.. ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ వారు, సన్నిహితులు సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే ‘యశోద’ ప్రమోషన్స్‌లో భాగంగా సమంత తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ ఎమోషనల్ అవడం చూసి అభిమానులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నానని, త్వరలో పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చింది..

తర్వాత సామ్ ప్రధాన పాత్రలో నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం ‘యశోద’ నవంబర్ 11న విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. ఆశ్చర్యపరిచే వసూళ్లు రాబట్టింది కూడా.. గతకొద్ది రోజులుగా సామ్ పూర్తి విశ్రాంతి తీసుకుంటోంది. విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్న ‘ఖుషి’ తో సహా మరికొన్ని సినిమాల షూటింగ్స్ ఆమె కోలుకున్న తర్వాతే చేద్దామని దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. కానీ ఇంతలోనే సమంత ‘శాకుంతలం’ మూవీ డబ్బింగ్ స్టార్ట్ చేసేసింది.

సినిమా అంటే తనకెంత ప్యాషన్ అనేది ఈ సంఘటనని బట్టి చెప్పొచ్చు. తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్న స్క్రీన్ ఇమేజ్ షేర్ చేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేసిందామె.. ‘‘బాధకైనా, ముఖ్యమైనవి కోల్పోయినపుడైనా, ఒంటరిగా వున్నా, ఇలాంటి పరిస్థితులల్లో ఆర్ట్ క్యూర్ లాంటిది’ అంటూ నిక్కి రోవ్ లైన్స్ యాడ్ చేసింది సామ్. గుణ శేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న హిస్టారికల్ ఫిలిం ‘శాకుంతలం’..

ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైైల్డ్ ఆర్టిస్టుగా ఇంట్రడ్యూస్ అవుతోంది. గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. మోహన్ బాబు, అదితి బాలన్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. అత్యంత ప్రతిష్మాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus