Samantha: మేమిద్దరం బాగానే ఉన్నామంటున్న సమంత!

గత కొన్నిరోజులుగా నాగచైతన్య సమంత మధ్య విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఖాతాలలో సమంత ఇంటి పేరు అయిన అక్కినేనిని తొలగించడంతో సమంత ఆ విధంగా ఎందుకు చేశారో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత అక్కినేని పేరు తొలగించడంపై సమయం వచ్చినపుడు చెబుతానని స్పందించారు. సమంత చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే సమంత నాగార్జున పుట్టినరోజున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపి పుకార్లకు చెక్ పెట్టారు. ఆ తర్వాత నాగ్ పుట్టినరోజు వేడుకల్లో సమంత పాల్గొనకపోవడంతో సందేహాలు మరింత పెరిగాయి. అయితే మీడియాలో వైరల్ అవుతున్న వార్తల గురించి సమంత సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించారు. మీడియా ఊహించుకునే వార్తలకు, రియాలిటీకి తేడా ఉంటుందంటూ ఇన్‌స్టా స్టోరీలో సమంత పోస్ట్ పెట్టారు. తాను, చైతన్య మధ్య రిలేషన్ బాగానే ఉన్నా మీడియానే పెద్దది చేసి చూపిస్తోందని సమంత పరోక్షంగా చెప్పుకొచ్చారు.

సమంత, చైతన్య కలిసి డైరెక్ట్ గా వివరణ ఇస్తే మాత్రమే పుకార్లు ఆగిపోయే అవకాశం ఉంది. వచ్చే నెల 6వ తేదీన సమంత చైతన్యల పెళ్లిరోజు కావడంతో ఆరోజు చైసామ్ రిలేషన్ కు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంత ప్రస్తుతం బ్రేక్ తీసుకోగా కొన్ని నెలల తర్వాత కొత్త కథలను విని నచ్చిన కథలకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus