Samantha: సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందా?

స్టార్ హీరోయిన్ సమంత నటించిన యశోద మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. నవంబర్ రెండో వారంలో థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే యశోద సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డారని తెలుస్తోంది. ఈ సినిమాలోని యాక్షన్ సీన్లలో నటించడానికి సమంత ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలుస్తోంది. హాలీవుడ్ కు చెందిన ప్రముఖ స్టంట్ మ్యాన్ సమంతకు శిక్షణ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం సమంత ఒకవైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ కోసం పని చేసిన యానిక్ బెన్ యశోద సినిమా కోసం పని చేశారని సమాచారం అందుతోంది. ఉన్నిముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్ లతో పాటు మురళీ శర్మ, రావు రమేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా తెలుగుతో పాటు ఇతర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.

ఈ సినిమాతో సమంత కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందో లేదో చూడాలి. సినిమాలో ఎన్నో రిస్కీ షాట్స్ ఉన్నాయని సమంత ఎంతో కష్టపడి ఆ సన్నివేశాల్లో నటించారని సమాచారం అందుతోంది. సామ్ కెరీర్ లో ఈ స్థాయిలో కష్టపడిన సినిమా ఇదేనని బోగట్టా. సమంత ఈ సినిమా తాను కోరుకున్న సక్సెస్ ను అందిస్తుందని చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధిస్తే సమంత నటించిన శాకుంతలం సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా రిజల్ట్ పైనే సమంతకు కొత్త సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. సమంత కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus