బ్రాండ్స్‌ను బుట్టలో పడేస్తున్న సమంత

  • February 12, 2021 / 02:38 PM IST

పెళ్లయ్యాక సమంత జోరు మామూలుగా లేదు. ఇదేదో ఆమె సినిమాల ఎంపికను చూసి మాత్రమే అంటున్నాం అనుకునేరు. ఆమె బ్రాండింగ్‌ చేస్తున్న ప్రోడక్ట్‌ల గురించి చెబుతున్న మాట ఇది. వరుస సినిమా అవకాశాలు కొట్టేస్తున్నట్లు, వరుసగా బ్రాండింగ్‌ అవకాశాలను సంపాదించేసుకుంటుంది సామ్‌. ఓవైపు భర్త నాగచైతన్యతో యాడ్‌లు చేస్తూనే, సోలోగా కూడా యాడ్‌లు చేస్తూ వస్తోంది. బాలీవుడ్‌ హీరోయిన్ల రేంజిలో బ్రాండింగ్‌ అవకాశాలు సంపాదిస్తుంది అనడంలో సందేహం లేదు. తాజాగా ఓ చాక్లెట్‌ కంపెనీకి బ్రాండింగ్‌ చేస్తోందని సమాచారం.

సమంత ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘మంచ్‌’ చాక్లెట్‌కు సంబంధించిన యాడ్‌ షూటింగ్‌లో పాల్గొంటుందోట. వాలెంటైన్స్‌ డే స్పెషల్‌గా ఆ యాడ్‌ను తీసుకొస్తున్నారనే సమాచారం అందుతోంది. ప్రముఖ యాడ్‌ డైరక్టర్‌ ఈ యాడ్‌ను తీర్చిదిద్దుతున్నారట. సినిమాల్లోకి వచ్చే ముందు సమంత కొన్నియాడ్స్‌లో నటించింది. అయితే సినిమాల్లోకి వచ్చాక వాటికి విరామం ఇచ్చింది. స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలోనూ యాడ్స్‌ చేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం వరుసగా యాడ్‌లు చేస్తూ వస్తోంది. కోల్గేట్‌, రెక్సనో, మింత్రా, సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌, బిగ్‌సి లాంటి యాడ్‌లు చేస్తోంది.

సమంత జోరు చూస్తుంటే భవిష్యత్తు ఇంకా యాడ్‌లు చేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్‌ ‘శాకుంతలం’ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో పాల్గొంటోంది. దీంతోపాటు తమిళంలో ఒక సినిమా చేస్తోంది. విఘ్నేష్‌ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్‌ గా విజయ్‌ సేతుపతి హీరోగా నటిస్తున్న సినిమాలో సామ్‌ మరో నాయిక. బాలీవుడ్‌లో నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌లో త్వరలో విడుదల కానుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus