‘బిగ్ బాస్4’ హోస్ట్ గా సమంత..వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదే..!

నాగార్జున ప్రస్తుతం ‘బిగ్ బాస్4’ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే మరోపక్క ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్లో కూడా పాల్గొంటున్నారు.అహిషర్ సోలమన్ డైరెక్ట్ చేస్తున్న ‘వైల్డ్ డాగ్’ చిత్రం షూటింగ్…ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది. అయితే కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల 6నెలల పాటు వాయిదా పడి… ఈ మధ్యనే తిరిగి ప్రారంభమయ్యింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ కోసం చిత్ర యూనిట్ సభ్యులతో పాటు నాగార్జున కూడా మనాలి షెడ్యూల్లో జాయినవ్వాల్సి ఉందట.

దాంతో ‘బిగ్ బాస్4’ కు నాగార్జున ఓ శనివారం రోజు బ్రేక్ ఇవ్వాల్సిందే. మరి ఈ క్రమంలో ఆ వీకెండ్ ఎవరు హోస్ట్ చేస్తారు అనేది ప్రశ్నర్ధకంగా మారింది. గతేడాది అయితే రమ్యకృష్ణ హోస్ట్ చేశారు. ఈ ఏడాది ‘జబర్దస్త్’ జడ్జ్ అయిన రోజా హోస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు నాగ్ కోడలు సమంత పేరు కూడా వినిపిస్తుంది. గతేడాది రమ్యకృష్ణను రికమండ్ చేసిన నాగార్జున ఇప్పుడు సమంతను రెండు ఎపిసోడ్లకు ‘బిగ్ బాస్4’ హోస్ట్ గా రిఫర్ చేశాడంటూ వార్తలు వస్తున్నాయి.

అది నిజమే అయితే టి.ఆర్.పి ఓ రేంజ్లో నమోదవుతుంది అనడంలో సందేహం లేదు. అయితే నాగార్జున వారం మొత్తం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ ను చూసి.. హౌస్మేట్స్ కు ఇన్పుట్స్ ఇస్తుంటారు.మరి సమంత అన్ని ఎపిసోడ్స్ ఫాలో అవుతుందా.. తెలుగులో నాన్ స్టాప్ గా మాట్లాడుతుందా? అంటే అనుమానమనే చెప్పాలి.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus