Samantha: సిద్ధూ జొన్నలగడ్డ పని బాగుంది..వరుసగా స్టార్స్ తో..!

సమంత ఇప్పుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ‘ఖుషి’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో సమంత మునుపెన్నడూ లేని విధంగా కనిపించబోతుంది అని టాక్. మరో రెండు షెడ్యూల్స్ లో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. అలాగే హిందీలో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తుంది సమంత. ఎంత కాదు అనుకున్నా మరో రెండు నెలల్లో వీటి షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కాకుండా మరో ప్రాజెక్ట్ కి (Samantha) సమంత సైన్ చేసింది అంటూ ఏమీ లేదు. అయినా సోషల్ మీడియాలో సమంత ఫలానా ప్రాజెక్టులో నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ సరసన సమంత హీరోయిన్ గా నటించడానికి రెడీ అయ్యింది అని టాక్. ‘డిజె టిల్లు’ తో సిద్ధూ మార్కెట్ బాగానే పెరిగింది. ఇప్పుడు అతను పెద్ద ప్రాజెక్టుల్లో భాగం అవుతున్నాడు.

చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అలాగే మరోపక్క ‘డిజె టిల్లు’ కి సీక్వెల్ కూడా చేస్తున్నాడు. వీటితో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. చాలా వరకు స్క్రిప్ట్ పనులు అయిపోయాయి. హీరోయిన్ గా సమంతని ఫిక్స్ చేయాలని నందినీ రెడ్డి భావిస్తుంది. సమంత కూడా ఈ ప్రాజెక్టులో నటించడానికి రెడీగానే ఉంది అని వినికిడి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus