Samantha, Varun Dhawan: వరుణ్ ధావన్ తో సమంత రొమాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సిరీస్ కి ప్రేక్షకాదరణ దక్కింది. ఇందులో సమంత పెర్ఫార్మన్స్ కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమ బోల్డ్ పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకుంది సమంత. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించడానికి రెడీ అవుతోంది ఈ బ్యూటీ. అది కూడా ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శకులతోనే కావడం విశేషం.

దర్శకులు రాజ్ అండ్ డీకే సౌత్ వాళ్లే అయినప్పటికీ బాలీవుడ్ బాగా ఫేమస్ అయ్యారు. ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న రాజ్ అండ్ డీకే ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ను తెరకెక్కించనున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో దీన్ని నిర్మించబోతోంది. ఇందులో హీరోగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను ఎంపిక చేసుకున్నారు.

హీరోయిన్ గా టాలీవుడ్ ముద్దుగుమ్మ సమంతను తీసుకున్నట్లు సమాచారం. తొలిసారి ఆమె వరుణ్ ధావన్ తో జత కట్టబోతుంది. రాజ్ అండ్ డీకేలతో ఇదివరకే కలిసి పని చేయడం.. వెబ్ సిరీస్ స్టోరీ నచ్చడంతో సామ్ ఇందులో నటించడానికి అంగీకరించింది. వచ్చే ఏడాది నుంచి ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.

మొత్తానికి విడాకుల తరువాత సమంత వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతూ.. బిజీ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం ఆమె ‘యశోద’ అనే సినిమాలో నటిస్తోంది. దీని తరువాత బాలీవుడ్ లోనే ఓ సినిమా చేయబోతుందని.. దానికి తాప్సి నిర్మాతగా వ్యవహరించనుందని మాటలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా అమ్మడు చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus