Samantha: ఆర్మాక్స్ సర్వేలో సమంత, రష్మిక, పూజా హెగ్డే స్థానాలు ఇవే!

ఆర్మాక్స్ సర్వేలో టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో ప్రభాస్ (Prabhas)  , మహేష్ బాబు (Mahesh Babu), జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఏప్రిల్ 2024 జాబితాలో సమంత ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. ఈ మధ్య కాలంలో సమంత ఎక్కువ సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సమంతకు (Samantha) తొలి స్థానం దక్కడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారు.

సమంత తన పుట్టినరోజు కానుకగా కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించగా ఆ ప్రాజెక్ట్ లతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ జాబితాలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు (Kajal Aggarwal) రెండో స్థానం దక్కింది. భగవంత్ కేసరి (Bhagavanth Kesari)  హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు పెరిగాయి. కాజల్ నటించిన సత్యభామ మూవీ  (Kajal’s Satyabhama)  త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న అనుష్కకు (Anushka Shetty) ఈ జాబితాలో మూడో స్థానం దక్కింది.

ఈ జాబితాలో శ్రీలీల (Sreeleela) , సాయిపల్లవి (Sai Pallavi), రష్మిక (Rashmika Mandanna) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. తమన్నా భాటియా (Tamannaah) ఏడో స్థానంలో నిలవగా కీర్తి సురేష్ (Keerthy Suresh) ఎనిమిదో స్థానంలో నిలవడం గమనార్హం. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచారు. టిల్లు స్క్వేర్ (Tillu Square) తో హిట్ సాధించిన అనుపమ (Anupama Parameswaran) ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు. అనుమప పరమేశ్వరన్ తెలుగులో వరుసగా కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

అనుపమ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. అనుపమ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ తో మ్యాజిక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ జాబితాలో చోటు దక్కని హీరోయిన్లు మాత్రం తెగ ఫీలైపోతున్నారని తెలుస్తోంది. టాలీవుడ్ హీరోయిన్లకు ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపు దక్కుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus