పెళ్లి డేట్ ఫిక్స్ కావడంతో శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సమంత
- May 20, 2017 / 06:57 AM ISTByFilmy Focus
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు సమంతకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. బయటికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానుల మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా, రాజుగారి గది 2 లో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల చిత్రీకరణ వేగంగా సాగుతోంది. ఇంత బిజీ షెడ్యూల్ ల్లో సమంత శ్రీవారిని దర్శించుకోవడం వెనుక కారణం ఏమిటని ఆరా తీయగా ఆసక్తికర విషయం తెలిసింది.
సమంత ప్రేమించిన నాగ చైతన్య తో ఎటువంటి అడ్డంకులు లేకుండా జనవరి 29న నిశ్చితార్ధం జరిగింది. అలాగే అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టే ముహూర్తం విషయంలో కొన్ని రోజులుగా ఓ నిర్ణయం తీసుకోలేక పోయారు. నిన్ననే ఆ ముహుర్తాన్ని అక్కినేని నాగార్జున ఫిక్స్ చేశారు. అక్టోబర్ 6 తేదీన గోవాలో సమంత, నాగచైతన్యల పెళ్లి చేయాలనీ కుటుంబ సభ్యులు అనుకున్నారు. దీంతో ఈ పెళ్లి కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా జరగాలని సమంత శ్రీవారిని వేసుకున్నట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













